డాక్టర్ల మాట కూడా లెక్కచేయలేదు : కృతి
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద 2020ని తన కెరియర్‌లోనే ‘లో పాయింట్’గా వివరించింది. సాధారణంగా వర్క్ హాలిక్ అయిన తను, 2020లో పని చేయకుండా ఉంటానని అనుకోలేదని తెలిపింది. లాక్‌డౌన్ ప్రారంభంలో 21 రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుందనుకున్నా కానీ, చివరకు అది ఆరు నెలల వరకు కొనసాగిందని చెప్పింది. ఒక పాయింట్ తర్వాత ఇక బయటకు వెళ్తామో లేదో అనే నిర్ణయానికి వచ్చామని వెల్లడించింది. ఇక లాక్‌డౌన్ ముగిశాక వర్క్ […]
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద 2020ని తన కెరియర్‌లోనే ‘లో పాయింట్’గా వివరించింది. సాధారణంగా వర్క్ హాలిక్ అయిన తను, 2020లో పని చేయకుండా ఉంటానని అనుకోలేదని తెలిపింది. లాక్‌డౌన్ ప్రారంభంలో 21 రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుందనుకున్నా కానీ, చివరకు అది ఆరు నెలల వరకు కొనసాగిందని చెప్పింది. ఒక పాయింట్ తర్వాత ఇక బయటకు వెళ్తామో లేదో అనే నిర్ణయానికి వచ్చామని వెల్లడించింది. ఇక లాక్‌డౌన్ ముగిశాక వర్క్ మొదలెట్టే టైమ్‌లో కెమెరాను ఎదుర్కోవడం చాలా ఎమోషనల్‌గా అనిపించిందని వివరించింది.
తిరిగి సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడాన్ని కృతజ్ఞతగా భావించానని తెలిపిన కృతి.. ఆ సమయంలో తను మలేరియాతో బాధపడ్డానని, వైద్యులు బయటకు వెళ్లకూడదని సూచించారని తెలిపింది. కానీ పనిచేయాలనే తపనతో డాక్టర్ల మాట వినిపించుకోలేదని చెప్పింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న సమయంలోనూ పనిచేయాల్సి వచ్చిందని.. కానీ దేవుడి దయతో కరోనా సోకలేదని తెలిపింది. కొవిడ్ తర్వాత ‘14 ఫెరే’ సినిమా షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడం ఆనందంగా ఉందన్న కృతి.. ప్యాచ్ వర్క్, పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చింది.