చైనా ఆధీనంలోనే భారతీయులు: కిరణ్ రిజిజు
దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు అడవిలో వేటకు వెళ్లిన ఐదుగురిని చైనా ఆర్మీ అపహరించిన వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం స్పష్టత నిచ్చారు. భారతీయులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలోనే ఉన్నట్టు ధృవీకరించారని ఆయన స్పష్టం చేశారు. అయితే, వారిని స్వదేశానికి రప్పించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చాడు. ఎగువ సుబాన్సిరి జిల్లా నాచో పట్టణ […]
దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు అడవిలో వేటకు వెళ్లిన ఐదుగురిని చైనా ఆర్మీ అపహరించిన వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం స్పష్టత నిచ్చారు. భారతీయులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలోనే ఉన్నట్టు ధృవీకరించారని ఆయన స్పష్టం చేశారు. అయితే, వారిని స్వదేశానికి రప్పించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చాడు.
ఎగువ సుబాన్సిరి జిల్లా నాచో పట్టణ సమీపంలోని అడవిలోకి వేటకు వెళ్లిన తగిన్ కమ్యూనిటీకి చెందిన ఐదుగురిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేశారన్న వార్తతో బాధిత కుటుంబీకులు ఆందోళనలో పడ్డారు. దీంతో కేంద్ర మంత్రి పీఎల్ఏతో సంప్రదింపులు చేసి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారిని విడిపించేందుకు చర్యలు చేపట్టారు.