ఎక్మోపై 65 రోజులు ఉన్న 12 ఏళ్ల బాలుని ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలో దేశంలోనే పేరున్న ఆస్పత్రిగా గుర్తింపు పొందిన కిమ్స్ ఆస్పత్రి వైద్యులు మరో క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని ప్రాణాలు కాపాడారు. నార్త్ ఇండియాకు చెందిన ఓ బాలుడు తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం దెబ్బతినడంతో ఎక్మో థెరపీ కోసం అక్కడినుంచి ప్రత్యేక విమానంలో కిమ్స్ కు తీసుకొచ్చి వీనో-వీనస్ ఎక్మోపై 65 రోజుల పాటు ఉంచి లైఫ్ సపోర్ట్ అందించారు. ఇందులో […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలో దేశంలోనే పేరున్న ఆస్పత్రిగా గుర్తింపు పొందిన కిమ్స్ ఆస్పత్రి వైద్యులు మరో క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని ప్రాణాలు కాపాడారు. నార్త్ ఇండియాకు చెందిన ఓ బాలుడు తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం దెబ్బతినడంతో ఎక్మో థెరపీ కోసం అక్కడినుంచి ప్రత్యేక విమానంలో కిమ్స్ కు తీసుకొచ్చి వీనో-వీనస్ ఎక్మోపై 65 రోజుల పాటు ఉంచి లైఫ్ సపోర్ట్ అందించారు. ఇందులో భాగంగా అన్ని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో నిశితంగా పరిశీలించి, అదనపు పోషకాహారం అందించి, శారీరక వ్యాయామం ద్వారా అవయవాల పనితీరు మెరుగుపరిచి, ఎక్మోపై ఉంచి అత్యాధునికంగా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచారు.
కిమ్స్ ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్ బొల్లినేని శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కొవిడ్ తీవ్రస్థాయిలో ఉండి, న్యుమోనియా వచ్చిన పిల్లలకు ఎక్మో బ్రిడ్జిపై ఇంత ఎక్కువకాలం చికిత్స చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. రెండు నెలలకుపైగా ఈ తరహా చికిత్స పొంది, ప్రాణాలు దక్కిన ఇంత చిన్నవయసు కేసు ఇప్పటివరకు దేశంలోనే ఇది మొదటిసారి అని తెలిపారు. బాలునికి చికిత్సలు అందించిన డాక్టర్ సందీప్ అత్తావర్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం పని తీరును ఆయన అభినందించారు. కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ, “ఈ బాలుడిని మా వద్దకు తీసుకొచ్చినప్పుడు అతడి ఊపిరితిత్తులు బాగా చెడిపోయి గట్టిగా అయ్యాయన్నారు. దాంతో అతడి శరీరానికి ఆక్సిజన్ అందడం లేదని, ఎక్మో సపోర్ట్ వల్ల అతడి ఊపిరితిత్తులకు విశ్రాంతి లభించిందని తెలిపారు. వైద్య సేవలు అందించడంతో దాంతో వాటంతట అవే బాగుపడి, పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుని మళ్లీ పనిచేయడం ప్రారంభించాయన్నారు.