చంపి ఉరేశారు.. ఆత్మహత్యగా నమ్మించారు.. అడ్డంగా దొరికారు
దిశ, జల్‌పల్లి : మద్యానికి బానిసై తరచు గొడవపడుతున్నాడని అల్లుడిని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న అత్తతో పాటు మరో ఇద్దరిని పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. మహేశ్వరం ఇమామ్‌గూడ గుడిసెల ప్రాంతానికి చెందిన యాదమ్మ (55) ఇంటి సమీపంలోనే నివసించే తన కూతురు అల్లుడైన జంగయ్యలు రాంఖీ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. జంగయ్య మద్యానికి […]
దిశ, జల్‌పల్లి : మద్యానికి బానిసై తరచు గొడవపడుతున్నాడని అల్లుడిని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న అత్తతో పాటు మరో ఇద్దరిని పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.
మహేశ్వరం ఇమామ్‌గూడ గుడిసెల ప్రాంతానికి చెందిన యాదమ్మ (55) ఇంటి సమీపంలోనే నివసించే తన కూతురు అల్లుడైన జంగయ్యలు రాంఖీ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. జంగయ్య మద్యానికి బానిసై ప్రతిరోజు చిత్తుగా మద్యం సేవించి భార్యతో పాటు అత్త యాదమ్మతో గొడకు దిగేవాడు. తన భార్యను తనకు దూరం చేస్తుందన్న అనుమానంతో ఈ నెల 24 వ తేదీన మరోసారి చిత్తుగా మద్యం సేవించిన జంగయ్య రాత్రి 10.30 గంటలకు అత్త యాదమ్మ ఇంటికి వెళ్లి దుర్భాషలాడాడు. అత్తా అల్లుడు మధ్య మాటా మాటా పెరగడంతో యాదమ్మ తోసివేయడంతో జంగయ్య కిందపడ్డాడు.
దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఇదే అదనుగా భావించిన యాదమ్మ గొడవను గమనించి వచ్చిన రాంఖీ కంపెనీలో సూప్వైజర్గా పని చేసే నీరడి రాజు (40)తో కలిసి చీరతో ఉచ్చు బిగించి రొట్టెలు చేసే కర్రతో బాది హత్య చేశారు. అల్లుడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందరిని నమ్మించారు. జంగయ్య కుటుంబ సభ్యులను సైతం నమ్మించాలని నీరడి రాజు, అతని కింద లేబర్‌గా పనిచేసే రాములు(38)తో కలిసి అడవి ప్రాంతంలో జంగయ్య చెట్టుకు ఉరివేసుకుని అత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాలని కుట్ర పన్నారు.
ఈ నేపధ్యంలో రాజు, రాములు ద్విచక్రవాహనంపై మృతుడు జంగయ్యను మధ్యలో కూర్చుండ బెట్టుకుని మహేశ్వరం అడవుల్లోకి తీసుకెళ్లి చెట్టుకు వ్రేలాడదీసి ఆత్మహత్య చేసుకుని జంగయ్య మృతిచెందినట్టుగా చిత్రీకరించారు. పోలీసులు వచ్చే లోపే హడావిడిగా మృతదేహాన్ని కిందికి దింపి అంత్యక్రియలకు వెళ్లడానికి ప్రయత్నించారు. అనుమానంతో యాదమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. జంగయ్యను హత్య చేసిన యామ్మ, రాజుతో పాటు వారికి సహకరించిన రాములు ను పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.