ఖైరతాబాద్‌లో తొలిరోజు 90 దరఖాస్తులు మాత్రమే

దిశ, ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో కేవలం 90 మంది మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ అధికారులు.. నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తుదారుల స్వీకరణ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినా యువజనులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోవడమా…? లేక అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల విఫలం […]

Update: 2021-11-06 08:53 GMT
ఖైరతాబాద్‌లో తొలిరోజు 90 దరఖాస్తులు మాత్రమే
  • whatsapp icon

దిశ, ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో కేవలం 90 మంది మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ అధికారులు.. నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తుదారుల స్వీకరణ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినా యువజనులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోవడమా…? లేక అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల విఫలం అయ్యారో తెలియదు కానీ, కేవలం 90 మంది మాత్రమే ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోగా.. సవరణల నిమిత్తం 12 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 27, 28 తేదీలలో మరో విడత దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News