ఆవు పేడతో అదిరిపోయే ‘పెయింట్’..
దిశ, వెబ్‌డెస్క్ : పశువుల పేడతో గ్యాస్ తయారు చేస్తారనే విషయం విన్నాము కానీ, పెయింట్ తయారు చేస్తారని ఎప్పుడైనా విన్నారా.. అవును అది నిజమే.. దాని పేరు ’ఖాదీ ప్రక్రితిక్ పెయింట్’ మేడ్ ఇన్ ఇండియా.. ఈ పెయింట్‌ను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. దీనిని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు రాజస్థాన్‌లోని జైపూర్‌లో డెవలప్ చేశారు. ఆవు పేడతో తయారైన ఈ పెయింట్ ఎకో ఫ్రెండ్లీ మరియు యాంటీ […]
దిశ, వెబ్‌డెస్క్ : పశువుల పేడతో గ్యాస్ తయారు చేస్తారనే విషయం విన్నాము కానీ, పెయింట్ తయారు చేస్తారని ఎప్పుడైనా విన్నారా.. అవును అది నిజమే.. దాని పేరు ’ఖాదీ ప్రక్రితిక్ పెయింట్’ మేడ్ ఇన్ ఇండియా..
ఈ పెయింట్‌ను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. దీనిని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు రాజస్థాన్‌లోని జైపూర్‌లో డెవలప్ చేశారు. ఆవు పేడతో తయారైన ఈ పెయింట్ ఎకో ఫ్రెండ్లీ మరియు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుందని కేంద్రం ప్రకటించింది. దీని ప్రారంభ ధర లీటర్ డిస్టెంపర్‌కు రూ.120, ఎమల్షన్‌కు రూ.225 ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.