కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేజీఎఫ్ డైరెక్టర్ ట్వీట్
దిశ, సినిమా : ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కానీ కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయం మాత్రం సినీ పరిశ్రమకు, థియేటర్లకు నష్టం వాటిల్లేలా ఉంది. ఇప్పుడే థియేటర్స్‌లో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ అనుమతించలేమని స్పష్టం చేస్తూ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఈ నెల చివరి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తాయని పేర్కొంది. కాగా ఈ నిర్ణయంపై కన్నడ ఫిల్మ్ […]
దిశ, సినిమా : ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కానీ కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయం మాత్రం సినీ పరిశ్రమకు, థియేటర్లకు నష్టం వాటిల్లేలా ఉంది. ఇప్పుడే థియేటర్స్‌లో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ అనుమతించలేమని స్పష్టం చేస్తూ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఈ నెల చివరి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తాయని పేర్కొంది. కాగా ఈ నిర్ణయంపై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. తాజాగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హోటల్స్, రెస్టారెంట్స్‌లో పూర్తిస్థాయి సీటింగ్‌కు అనుమతించిన కర్ణాటక గవర్నమెంట్.. థియేటర్స్‌కు మాత్రం ఎందుకిన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది’ అని ప్రశ్నించారు. ‘సినిమా చాలా మందికి వినోదం అయితే.. మరెంతో మందికి లైఫ్ లైన్’ అని ట్వీట్ చేశాడు.
While cinema is entertainment to most, it's lifeline to many.#KFIdemandsFullOccupancy@drashwathcn @CMofKarnataka @mla_sudhakar pic.twitter.com/rkNjc8eWBX
— Prashanth Neel (@prashanth_neel) February 3, 2021