సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే: కేశవరావు

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని , ఎలాంటి వివాదాలు అవసరం లేదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం హైదరాబాద్ సంస్థాన విలీన దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదని, మనకు స్వాతంత్య్రం  కోసం ఏడాది ఆగామన్నారు. సంతోషకరమైన రోజు సెప్టెంబర్ 17 అని, సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవం మనకు వచ్చిందని పేర్కొన్నారు. […]

Update: 2021-09-17 06:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని , ఎలాంటి వివాదాలు అవసరం లేదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం హైదరాబాద్ సంస్థాన విలీన దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదని, మనకు స్వాతంత్య్రం కోసం ఏడాది ఆగామన్నారు. సంతోషకరమైన రోజు సెప్టెంబర్ 17 అని, సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవం మనకు వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో విలీనం కావాలని తెలంగాణ ప్రజలంతా నాడు కోరుకున్నట్లు తెలిపారు.

టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన యావత్ భారత్ కు రోల్ మోడల్ గా మారిందన్నారు. ప్రభుత్వం, పార్టీ రెండూ వేరు వేరు కాదని, పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నది గులాబీ సైన్యం గుర్తించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణాను ముందు వరుసలో ఉంచిన సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతికత ఏ ఒక్కరికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీలు ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్ కుమార్ గుప్తా, ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ , ఓయూ విద్యార్థి నాయకులు కడారి స్వామి యాదవ్ , రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News