గోల్డ్ స్మగ్లింగ్: కేరళ ప్రిన్సిపల్ సెక్రెటరీపై వేటు

తిరువనంతపురం: కేరళ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం శివశంకర్‌పై ప్రభుత్వం వేటువేసింది. సుమారు 30కిలోల బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి ఐటీశాఖ ఉద్యోగి స్వప్న సురేష్ కీలకపాత్ర వహించినట్టు తెలియడంతో ఆమెను నియమించిన ప్రక్రియలో ప్రమేయమున్న శివ శంకర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా అతన్ని తొలగించి మరో ఐఏఎస్ అధికారి మీర్ ముహమ్మద్ అలీని నియమించింది. కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(కేఎస్ఐటీఐఎల్) మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వప్న […]

Update: 2020-07-07 06:22 GMT

తిరువనంతపురం: కేరళ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం శివశంకర్‌పై ప్రభుత్వం వేటువేసింది. సుమారు 30కిలోల బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి ఐటీశాఖ ఉద్యోగి స్వప్న సురేష్ కీలకపాత్ర వహించినట్టు తెలియడంతో ఆమెను నియమించిన ప్రక్రియలో ప్రమేయమున్న శివ శంకర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా అతన్ని తొలగించి మరో ఐఏఎస్ అధికారి మీర్ ముహమ్మద్ అలీని నియమించింది. కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(కేఎస్ఐటీఐఎల్) మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వప్న పాత్ర గోల్డ్ స్మగ్లింగ్‌లో ఉన్నట్టు తెలియడంతో విపక్షాలు సర్కారుపై ఆరోపణలు సంధించాయి. ఆమె నియామకం గురించి తనకు తెలియదని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి, కేఎస్ఐటీఐఎల్ చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా వివాదంతో శివశంకర్‌ను ప్రభుత్వం ఆ విధుల్లో నుంచి తొలగించింది. తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్ అధికారులు సుమారు 30 కిలోల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News