సెక్స్ కోసం బయటికి వెళ్తా.. పాస్ ఇప్పించండి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశంలో ప్రళయం సృష్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దని పోలీసులు ఆదేశాలు జారీచేస్తున్నారు. అక్కడక్కడ ఆకతాయిలు తప్ప మిగతావారందరు లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక ఏమైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు పోలీసుల వద్ద నుండి ఈ- పాస్ తీసుకొని […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశంలో ప్రళయం సృష్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దని పోలీసులు ఆదేశాలు జారీచేస్తున్నారు. అక్కడక్కడ ఆకతాయిలు తప్ప మిగతావారందరు లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక ఏమైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు పోలీసుల వద్ద నుండి ఈ- పాస్ తీసుకొని బయటికి వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఈ- పాస్ ల వినతులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. కొంతమంది ఆకతాయిలు చిన్న చిన్న విషయాలకు బయటికి వెళ్లాలని, అందుకే తమకు ఈ- పాస్ లను ఇప్పించాలని కోరుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి సెక్స్ కోసం ఈ పాస్ కావాలని కోరడం పోలీసులను షాక్ కి గురిచేసింది. ఈ వింత సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళ పోలీసులకు ఈ- పాస్ లు కావాలని చాలా వినతి పత్రాలు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం చాలా వింతగా అనిపించింది. ఒక వ్యక్తి తనకు సెక్స్ చేయడానికి బయటికి వెళ్తాను.. కొంచెం ఈ- పాస్ ఇప్పించండి అని విజ్ఞప్తి చేశాడు. వెంటనే ఈ అప్లికేషన్ పెట్టిన ఆ వ్యక్తిని వాలాపట్టణం పోలీసులు అతన్ని వెతికి పట్టుకున్నారు. అయితే అతను తప్పు జరిగిపోయిందని.. ఇంగ్లీష్ లో ‘six o clock’ అని రాయబోయి ‘sex’ అని రాశానని, అది తెలియకుండా జరిగిన మిస్టేక్ అని వివరణ ఇచ్చాడు. దీంతో పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇలాగే బీహార్ లో కూడా ఒక వ్యక్తి తనకి ముఖం మీద మచ్చలు వచ్చాయని, వాటిని తొలగించడానికి పార్లర్ కి వెళ్ళడానికి ఈ- పాస్ ఇప్పించాల్సిందిగా కోరాడు. ఇలాంటి ఆకతాయిలందరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.