ముస్లిం మహిళల విడాకులపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు

కొచ్చి: కేరళ హైకోర్టు ముస్లిం మహిళల హక్కులపై సంచలన తీర్పు వెలువరించింది. న్యాయస్థానాల జోక్యం లేకుండా పర్సనల్ లా కింద వారు విడాకులు ఇచ్చి తమ వివాహ బంధాన్ని ముగించుకునే హక్కు కలిగి ఉంటారని స్పష్టం చేసింది. షరియత్ చట్టంలోని సెక్షన్ 2 కింద పొందుపరిచిన అన్ని(నాలుగు) విధానాల్లో మహిళలూ విడాకులు ఇవ్వవచ్చునని దాదాపు 50 ఏళ్ల కిందటి తీర్పును కొట్టేసింది. ముస్లిం మహిళలు విడాకులు ఇవ్వడానికి న్యాయవ్యవస్థను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదని 1972లో […]

Update: 2021-04-15 11:57 GMT

కొచ్చి: కేరళ హైకోర్టు ముస్లిం మహిళల హక్కులపై సంచలన తీర్పు వెలువరించింది. న్యాయస్థానాల జోక్యం లేకుండా పర్సనల్ లా కింద వారు విడాకులు ఇచ్చి తమ వివాహ బంధాన్ని ముగించుకునే హక్కు కలిగి ఉంటారని స్పష్టం చేసింది. షరియత్ చట్టంలోని సెక్షన్ 2 కింద పొందుపరిచిన అన్ని(నాలుగు) విధానాల్లో మహిళలూ విడాకులు ఇవ్వవచ్చునని దాదాపు 50 ఏళ్ల కిందటి తీర్పును కొట్టేసింది. ముస్లిం మహిళలు విడాకులు ఇవ్వడానికి న్యాయవ్యవస్థను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదని 1972లో కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించిన తీర్పును తాజాగా ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఖురాన్ పవిత్రగ్రంథం మహిళలు, పురుషులకు సమాన హక్కులు కల్పించిందని ఉద్ఘాటించింది. కేసీ మోయిన్ వర్సెస్ నఫీస్ కేసు తీర్పుతో కేరళలో ముస్లిం మహిళల్లో అనుమానాలు ఏర్పడ్డాయని వివరించింది. ఆ కేసులో పర్సనల్ లా కింద మహిళలు విడాకులు ఇచ్చే హక్కును తొలగించిందని, అది సరైన నిర్ణయం కాదని భావిస్తున్నట్టు తెలిపింది.

Tags:    

Similar News