అర్థనగ్నంతో ఎందుకు చేశారు
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలతో తన ప్రైవేట్ భాగాలపై వాటర్ పేయింటింగ్ వేయించుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది కెరళ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా. కాగా, ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీడియోను ఎందుకు పోస్ట్ చేశారన్న కోణంలో విచారణ కోనసాగుతోంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఫాతిమా సుప్రీంకోర్టును ఆశ్రయించినా చివరకు చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు […]
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలతో తన ప్రైవేట్ భాగాలపై వాటర్ పేయింటింగ్ వేయించుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది కెరళ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా. కాగా, ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీడియోను ఎందుకు పోస్ట్ చేశారన్న కోణంలో విచారణ కోనసాగుతోంది.
దీంతో ముందస్తు బెయిల్ కోసం ఫాతిమా సుప్రీంకోర్టును ఆశ్రయించినా చివరకు చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు.
‘మీ పిల్లలు మైనర్ అని తెలిసి కూడా వారితో మీ ప్రైవేట్ భాగాలపై చిత్రాలు ఎందుకు వేయించుకున్నారు… అసలెందుకు ఇదంతా చేశారు.. ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. యాక్టివిస్ట్ అయినంత మాత్రానా ఇలా ప్రవర్తిస్తారా.. సభ్య సమాజంపై ఇది చాలా చెడు ప్రభావాన్ని చూయిస్తుంది.. మైనర్ పిల్లల ఆలోచన విధానాలను తప్పు దారులు పట్టిస్తాయి‘ అంటూ కోర్టు రెహానాకు ప్రశ్నలు వేసింది. ఇదే వ్యవహారంపై నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలన్న డిమాండ్ లు కూడా వినిపించడం గమనార్హం.