కీర్తి స్పెషల్.. చాక్లెట్ దోశ

క‌రోనా వైరస్ కారణంగా దాదాపు రెండునెల‌ల‌కు పైగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూ రోజు నుంచి షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇంట్లోనే హ్యాపీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మెల్ల‌మెల్ల‌గా లాక్‌డౌన్‌ను స‌డ‌లిస్తుండటంతో సినిమాలకు సంబంధించిన డ‌బ్బింగ్ ప‌నులు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఊపందుకుంటున్నాయి. ఇక షూటింగ్స్‌ కూడా మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. అయితే లాక్‌డౌన్ టైమ్‌లో హీరో, హీరోయిన్లు తమ వంట గదిలో ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. మహానటి ఫేమ్ కీర్తి […]

Update: 2020-06-01 03:44 GMT

క‌రోనా వైరస్ కారణంగా దాదాపు రెండునెల‌ల‌కు పైగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూ రోజు నుంచి షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇంట్లోనే హ్యాపీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మెల్ల‌మెల్ల‌గా లాక్‌డౌన్‌ను స‌డ‌లిస్తుండటంతో సినిమాలకు సంబంధించిన డ‌బ్బింగ్ ప‌నులు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఊపందుకుంటున్నాయి. ఇక షూటింగ్స్‌ కూడా మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. అయితే లాక్‌డౌన్ టైమ్‌లో హీరో, హీరోయిన్లు తమ వంట గదిలో ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కూడా కిచెన్‌లో గరిటె పట్టారు. ఇటీవలే బాగా ఫేమస్ అయిన చాక్లెట్ దోశను స్వయంగా వేసిన కీర్తి.. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.

‘సండే ఫన్ డే.. సండే వైబ్స్.. కుకింగ్ ఎట్ హోమ్.. కలర్స్ ఆఫ్ దోశ’ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు జతచేశారు. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా ‘రంగ్‌దే’లో నటిస్తోంది. కాగా కీర్తి నటించిన ‘పెంగ్విన్’ అనే తమిళ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 19న విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.

Tags:    

Similar News