దసరా తర్వాత ఉద్యోగాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ తర్వాత ఉద్యోగులను పిలిపించి సీఎస్‌తో చర్చలు జరిపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కొత్త జోనల్ విధానం ఇటీవల అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. 33 జిల్లాల ప్రజలకు ఆ జిల్లాలోనే ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందుకు కాస్త సమయం పడుతుందని.. వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం కొత్త జోనల్ వ్యవస్థలో సాధ్యం కాదన్నారు. దసరా పండుగ తర్వాత అన్నీ పరిశీలించి రిక్రూట్‌మెంట్‌లు వేస్తామన్నారు. రాష్ట్రంలో మారుమూలకు ఉన్న జిల్లాల్లో ఉద్యోగాలు […]
దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ తర్వాత ఉద్యోగులను పిలిపించి సీఎస్‌తో చర్చలు జరిపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కొత్త జోనల్ విధానం ఇటీవల అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. 33 జిల్లాల ప్రజలకు ఆ జిల్లాలోనే ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందుకు కాస్త సమయం పడుతుందని.. వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం కొత్త జోనల్ వ్యవస్థలో సాధ్యం కాదన్నారు. దసరా పండుగ తర్వాత అన్నీ పరిశీలించి రిక్రూట్‌మెంట్‌లు వేస్తామన్నారు. రాష్ట్రంలో మారుమూలకు ఉన్న జిల్లాల్లో ఉద్యోగాలు ఇచ్చినా.. చాలా వరకు ఆసక్తి చూపని సంఘటనలు ఉన్నాయని.. అందుకే జిల్లాలను పెంచి.. ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా, 95 శాతం లోకల్ యువతకే అవకాశం ఇచ్చేలా నూతన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుతం అనుకున్న లక్షా 50 వేల ఉద్యోగాలు కాకుండా.. మరో 70-80 వేల ఉద్యోగాలు అదనంగా తెలంగాణలో దొరుకుతాయని సీఎం కేసీఆర్ అంచనా వేశారు.