సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు 

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై kcr సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు విషయాలపై చర్చించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెక్లెస్ రోడ్‌కు పీవీ జ్ఞాన మార్గ్‌గా పేరు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ నిర్మిస్తామని వెల్లడించారు.  ప్రపంచం గుర్తించిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కేసీఆర్ ప్రశంసించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలిపారు. పీవీ పుట్టి పెరిగిన లక్నెపల్లి, వంగర లను పర్యాటక ప్రాంతాలుగా […]

Update: 2020-08-28 08:13 GMT

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై kcr సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు విషయాలపై చర్చించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెక్లెస్ రోడ్‌కు పీవీ జ్ఞాన మార్గ్‌గా పేరు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ నిర్మిస్తామని వెల్లడించారు.

ప్రపంచం గుర్తించిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కేసీఆర్ ప్రశంసించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలిపారు. పీవీ పుట్టి పెరిగిన లక్నెపల్లి, వంగర లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదనలు సైతం పంపుతామని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను విదేశాల్లోనూ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News