కుస్తీ పోటీలకు కాదు.. అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ సెటైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కుస్తీ పోటీలకు కాదు… అసెంబ్లీ ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు వేదిక మాత్రమే అని సభ్యులు గుర్తించుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అఖిల పక్షాలతో బీఏసీ( బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. అసెంబ్లీలో గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ ఆలోచన చేయాలన్నారు. వీలైనన్నీ ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించాలని సూచించారు. అన్ని అంశాలపై […]
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కుస్తీ పోటీలకు కాదు… అసెంబ్లీ ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు వేదిక మాత్రమే అని సభ్యులు గుర్తించుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అఖిల పక్షాలతో బీఏసీ( బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. అసెంబ్లీలో గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ ఆలోచన చేయాలన్నారు. వీలైనన్నీ ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించాలని సూచించారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలని, ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం తరపున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలని కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమలు, హరితహారం , వ్యవసాయంతో పాటు పాతబస్తీ అభివృద్ధి అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సూచించిన అంశాలను కూడా సభలో చర్చించాలన్నారు. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, వాయిదా తీర్మానాలు వంటి సభా సాంప్రదాయలను విధిగా పాటిస్తూ అసెంబ్లీని నిర్వహించాలన్నారు. బిల్లులను సభ్యులకు ముందస్తుగానే పంపించాలని, అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యులకు ప్రతిరోజూ లంచ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
పార్టీలకతీతంగా శాసన సభ్యులను వెంట తీసుకొని ఢిల్లీ పర్యటన చేపట్టాలని స్పీకర్ ను సీఎం కోరారు. తెలంగాణ శాసనసభ ఔన్నత్యాన్ని పెంచడానికి, దేశానికే ఆదర్శంగా నిలవడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలన్నారు. శాసన సభ రూల్ బుక్ ను సమీక్షించాలని, పలు కమిటీల మీటింగులు రెగ్యులర్ గా జరిగేలా చూడాలని చెప్పారు.