'కవితకు అలా.. పీవీ కూతురుకు మాత్రం ఇలానా..?'

దిశ,వెబ్ డెస్క్ : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బెదరింపులకు పాల్పడిందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టారని కిషన్ రెడ్డి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ఎంతో తెలివిగా పీవీ కూతురు సురభి వాణీదేవికి ఓడిపోయే సీటు ఇచ్చారని విమర్శించారు. కానీ, తన కూతురు కవితకు గెలిచే సీటు ఇచ్చి ఆమెను గెలిపించుకున్నారని అన్నారు. సెక్రటేరియట్‌కు రావడంలేదని […]

Update: 2021-03-07 04:53 GMT

దిశ,వెబ్ డెస్క్ : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బెదరింపులకు పాల్పడిందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టారని కిషన్ రెడ్డి తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ఎంతో తెలివిగా పీవీ కూతురు సురభి వాణీదేవికి ఓడిపోయే సీటు ఇచ్చారని విమర్శించారు. కానీ, తన కూతురు కవితకు గెలిచే సీటు ఇచ్చి ఆమెను గెలిపించుకున్నారని అన్నారు. సెక్రటేరియట్‌కు రావడంలేదని ఏకంగా సచివాలయాన్నే కూల్చివేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

 

Tags:    

Similar News