సీఏఏపై బీజేపీ అసత్య ప్రచారం: కేసీఆర్
సీఏఏపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సీఏఏపై మాట్లాడారు. లేని బర్త్ సర్టిఫికేట్లు తెమ్మంటే ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. తనకే లేకపోతే తన తండ్రి, తన తాత రికార్డులు తెమ్మంటె ఎక్కడికి వెళ్లాలో చెప్పాలన్నారు. సీఎం అయినప్పటికీ.. తాను సొంత ఊర్లో పుట్టానని.. ఆస్పత్రికి రికార్డులు కావాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. తమ ప్రభుత్వానికంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని కేసీఆర్ ఈ […]
సీఏఏపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సీఏఏపై మాట్లాడారు. లేని బర్త్ సర్టిఫికేట్లు తెమ్మంటే ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. తనకే లేకపోతే తన తండ్రి, తన తాత రికార్డులు తెమ్మంటె ఎక్కడికి వెళ్లాలో చెప్పాలన్నారు. సీఎం అయినప్పటికీ.. తాను సొంత ఊర్లో పుట్టానని.. ఆస్పత్రికి రికార్డులు కావాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. తమ ప్రభుత్వానికంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సీఏఏ, ఎన్పీఆర్ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. దీనిపై ఒకరోజు మొత్తం చర్చజరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
tag: kcr, comments, assembly, caa, npr