‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా?
దిశ, సినిమా : పాపులర్ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 21 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. జూలై 3, 2000న బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా స్టార్ట్ అయిన జర్నీపై నిర్మాత సిద్ధార్థ్ బసు నోట్ రిలీజ్ చేశాడు. రియాలిటీ షోస్ అంటే పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయన్న ఇమాజినేషన్ నుంచి బయటకు రావాలని కోరాడు. ఇది అలాంటి షోస్‌కు మినహాయింపు అని చెబుతూ.. ‘ కేబీసీ కేవలం క్విజ్ షో మాత్రమే […]
దిశ, సినిమా : పాపులర్ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 21 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. జూలై 3, 2000న బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా స్టార్ట్ అయిన జర్నీపై నిర్మాత సిద్ధార్థ్ బసు నోట్ రిలీజ్ చేశాడు. రియాలిటీ షోస్ అంటే పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయన్న ఇమాజినేషన్ నుంచి బయటకు రావాలని కోరాడు. ఇది అలాంటి షోస్‌కు మినహాయింపు అని చెబుతూ.. ‘ కేబీసీ కేవలం క్విజ్ షో మాత్రమే కాదు. మానవ కథ ఎల్లప్పుడూ ముఖ్యమైనదే.. ఫస్ట్ సీజన్ భారతదేశంలో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా వికాస్ తన Q&A పుస్తకాన్ని రాశాడు. కేబీసీలో చూపించే కథలు సింపతీ కోసం మాత్రమే కాదు. అవి రియల్ లైఫ్ స్టోరీస్. ప్రజలు భావోద్వేగానికి గురవడం ఇంజనీరింగ్ కాదు. ఇది మాసివ్ ఆడియన్స్ ముందు ప్రసారం అవుతున్న లైఫ్ చేంజింగ్ షో’ అని తెలిపాడు. ఇది హార్ట్‌తో పాటు మైండ్‌ను కూడా టచ్ చేసిన షో అని, ప్రేక్షకుల అభిమానంతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.