వివాదాలు.. బహిష్కరణ.. కత్తి మహేష్ జీవితంలో మలుపులెన్నో!
దిశ, వెబ్‌డెస్క్: కత్తి మహేష్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. ఫిల్మ్ క్రిటిక్‌గా, సినిమా దర్శకుడిగా, నటుడిగా.. ఇక వివాదాస్పద వ్యక్తిగా కత్తి మహేష్ అందరికీ సుపరిచితమే. పవన్ కల్యాణ్‌పై విమర్శలతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుదారుడిగా మారారు. కుటుంబ నేపథ్యమిదీ! ఏపీలోని చిత్తూరు జిల్లాలో కత్తి మహేష్ 1977లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ […]
దిశ, వెబ్‌డెస్క్: కత్తి మహేష్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. ఫిల్మ్ క్రిటిక్‌గా, సినిమా దర్శకుడిగా, నటుడిగా.. ఇక వివాదాస్పద వ్యక్తిగా కత్తి మహేష్ అందరికీ సుపరిచితమే. పవన్ కల్యాణ్‌పై విమర్శలతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుదారుడిగా మారారు.
కుటుంబ నేపథ్యమిదీ!
ఏపీలోని చిత్తూరు జిల్లాలో కత్తి మహేష్ 1977లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ దర్శకుడు అవ్వాలని కోరికతో అనేక ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అలాగే ‘మిణుగురులు’ చిత్రానికి కో రైటర్‌గా పనిచేశారు. అనంతరం నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించాడు. ఇకపోతే హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో నటుడిగా అలరించాడు. అలాగే టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్ వేదికగా సినిమాలకు రివ్యూ ఇస్తూ వివాదాల్లో నిలిచేవారు కత్తి మహేశ్.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్
సినిమాలకు రివ్యూలు ఇస్తూనే కత్తి మహేశ్ అటు సామాజిక, రాజకీయ అంశాలపైనా స్పందించే వారు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇకపోతే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనపై తెలంగాణ పోలీసులు కొరడ ఝుళిపించారు. ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యాఖలు చేసిన కత్తి మహేశ్‌పై 6 నెలల పాటు నగర బహిష్కరణ వేటు వేశారు. నిషేధిత గడవు సమయంలో ఆయన నగరంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో ఇలా నగర బహిష్కరణ చేసిన ఘటన ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో ఆయన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.