‘అనాథ శవం’ద్వారా అవార్డు అందుకున్న ఎస్ఐ శిరీష
దిశ, వెబ్‌డెస్క్ : ఓ లేడీ ఎస్ఐ తన భుజాలపై అనాథ శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంలో సామాన్యుడి నుంచి హైయ్యర్ ఆఫీసర్ వరకు ఆమెపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఆమె చూపిన చొరవకు డీజీపీ సైతం ముగ్ధుడయ్యాడు. ఆమె సేవలను గుర్తిస్తూ.. అవార్డును అందించారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శిరీష వారం రోజుల క్రితం […]
దిశ, వెబ్‌డెస్క్ : ఓ లేడీ ఎస్ఐ తన భుజాలపై అనాథ శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంలో సామాన్యుడి నుంచి హైయ్యర్ ఆఫీసర్ వరకు ఆమెపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఆమె చూపిన చొరవకు డీజీపీ సైతం ముగ్ధుడయ్యాడు. ఆమె సేవలను గుర్తిస్తూ.. అవార్డును అందించారు.
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శిరీష వారం రోజుల క్రితం గుర్తు తెలియని అనాథ శవాన్ని తానే స్వయంగా మోసుకెళ్లి ఓ స్వచ్ఛంధ సంస్థ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆమెను అభినందించారు. ఇలాంటి సేవాభావం ఉన్న వ్యక్తులు పోలీస్ శాఖలో ఉండడం గర్వకారణమని కితాబు ఇచ్చారు. శిరీష సేవాభావానికి గుర్తుగా డిస్క్ అవార్డును ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శిరీష మాట్లాడుతూ.. పోలీస్ శాఖ తన సేవను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని.. పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తానికి దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. పోలీసులు సేవ చేయడానికి ఉన్నారని అభిప్రాయపడ్డారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.