ఇప్పుడు దీపావళి..GHMCలో సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారు : బండి
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంత్రి గిఫ్ట్ కూడా ఇస్తారని ఆయన విమర్శించారు. నాడు బీజేపీ ఎక్కడుందన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మీ సొంత జిల్లాలోనే మా ఎమ్మెల్యే ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. 2023లో […]
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంత్రి గిఫ్ట్ కూడా ఇస్తారని ఆయన విమర్శించారు.
నాడు బీజేపీ ఎక్కడుందన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మీ సొంత జిల్లాలోనే మా ఎమ్మెల్యే ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.