కరోనా తీవ్రతను జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు: కరీనా

దిశ, సినిమా: ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న తీరును బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తప్పుపట్టింది. కొవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితుల తీవ్రతను కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారని, ఇది ఊహించుకునేందుకు కూడా కష్టంగా ఉందని బాధపడింది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ సరిగా ధరించాలని, కొవిడ్ నిబంధనలను ఫాలో కావాలని సూచించింది. ముఖ్యంగా మన వైద్య సిబ్బందిని గుర్తుకు తెచ్చుకోవాలని కోరింది. మెడికల్ స్టాఫ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా బ్రేకింగ్ పాయింట్‌లో ఉన్నారని, కరోనా చైన్‌ను బ్రేక్ […]

Update: 2021-04-28 05:10 GMT

దిశ, సినిమా: ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న తీరును బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తప్పుపట్టింది. కొవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితుల తీవ్రతను కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారని, ఇది ఊహించుకునేందుకు కూడా కష్టంగా ఉందని బాధపడింది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ సరిగా ధరించాలని, కొవిడ్ నిబంధనలను ఫాలో కావాలని సూచించింది. ముఖ్యంగా మన వైద్య సిబ్బందిని గుర్తుకు తెచ్చుకోవాలని కోరింది.

మెడికల్ స్టాఫ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా బ్రేకింగ్ పాయింట్‌లో ఉన్నారని, కరోనా చైన్‌ను బ్రేక్ చేసేందుకు ప్రతీ ఒక్కరు రెస్పాన్సిబుల్‌గా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇంతకు ముందు కన్న ఎక్కువగా ఇండియాకు ఇప్పుడు మీరు అవసరమని గుర్తు చేసింది. ఇక మరోవైపు కొవిడ్ నుంచి కోలుకున్న కత్రినా కైఫ్ డబుల్ మాస్క్ వినియోగంపై అవగాహన పెంచుతోంది. డబుల్ మాస్క్ సైంటిఫిక్ మాస్క్‌గా కరోనాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తుంది.

Tags:    

Similar News