బెబో దీపావళి ప్లాన్..

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్.. ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న కరీన.. బయటకు వెళ్ళే పని లేకుండా యాడ్ షూట్స్, పోడ్‌కాస్ట్ షూటింగ్స్ ఇంట్లోనే ప్లాన్ చేసింది. నిజానికి బాలీవుడ్ సెలెబ్రిటీల ఇంట్లో దీపావళి పండుగ అదిరిపోవాలి.. కానీ కరోనా వల్ల అతి సాధారణంగా జరుపుకోవాల్సి వస్తుంది. దీంతో ఈ సారి పండుగ ముంబైలో కాకుండా కాస్త వెరైటీగా ధర్మశాలలో చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది […]

Update: 2020-11-12 05:39 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్.. ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న కరీన.. బయటకు వెళ్ళే పని లేకుండా యాడ్ షూట్స్, పోడ్‌కాస్ట్ షూటింగ్స్ ఇంట్లోనే ప్లాన్ చేసింది. నిజానికి బాలీవుడ్ సెలెబ్రిటీల ఇంట్లో దీపావళి పండుగ అదిరిపోవాలి.. కానీ కరోనా వల్ల అతి సాధారణంగా జరుపుకోవాల్సి వస్తుంది. దీంతో ఈ సారి పండుగ ముంబైలో కాకుండా కాస్త వెరైటీగా ధర్మశాలలో చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది బెబో.

‘భూత్ పోలీస్’ షూటింగ్ కోసం ఇప్పటికే భర్త సైఫ్ అలీ ఖాన్ ధర్మశాల వెళ్లగా.. తను కూడా తైమూర్‌తో కలిసి అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపింది. పర్వతాల గుండా ప్రయాణం, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తానని చెప్పిన కరీన.. దాదాపు ఏడాది నుంచి వెకేషన్ లేకుండా ఇంట్లోనే ఉంటుండటంతో ఈ దీపావళిని ఇలా ప్లాన్ చేశామని చెప్పింది. డెఫినెట్‌గా ఇది పెద్ద దీపావళి మాత్రం కాదని.. అయినప్పటికీ సైఫ్, తైమూర్‌తో కలిసి ధర్మశాలలో సెలెబ్రేషన్స్ చేసుకోబోతుండటం మాత్రం చాలా స్పెషల్ అంటోంది.

కాగా కరీన, అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ క్రిస్మస్‌కు థియేటర్‌లోనే రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. కాగా ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు.

Tags:    

Similar News