వాళ్ల సాయమంతా ఫొటో గ్యాలరీల కోసమే : కంగనా రనౌత్

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుండగా.. బాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కంగనా రనౌత్ ఎవరికైనా సాయం చేసిందా? అని ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా.. అతడికి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చింది కంగన. ‘ప్రియాంక చోప్రా, ఆలియా భట్ వంటి స్టార్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉపయోగించుకుంటూ ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని కోరుతున్నారు. కంగన నుంచి […]

Update: 2021-05-01 01:16 GMT

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుండగా.. బాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కంగనా రనౌత్ ఎవరికైనా సాయం చేసిందా? అని ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా.. అతడికి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చింది కంగన. ‘ప్రియాంక చోప్రా, ఆలియా భట్ వంటి స్టార్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉపయోగించుకుంటూ ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని కోరుతున్నారు. కంగన నుంచి కూడా అలాంటి ట్వీట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ తను మాత్రం బీజేపీ ఇమేజ్‌ను పెంచే ప్రయత్నంలో బిజీగా ఉంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఒప్పుకుంటే ఏమవుతుంది?’ అని సదరు యూజర్ ప్రశ్నించాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన కంగన.. తనదైన రీతిలో సమాధానమిచ్చింది.

ఇతరులకు సాయం చేయాలనుకుంటే ట్విట్టర్ ఒక్కటే వేదిక కాదని, అందుకు చాలా మార్గాలున్నాయని వెల్లడించిన కంగన.. తను ఇప్పటికే అవసరమున్న చోట బెడ్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్‌తో పాటు ఆక్సిజన్ ఎక్విప్‌మెంట్ అందజేస్తున్నానని తెలిపింది. అంతేకాదు తన ప్రొఫెషనల్, పర్సనల్ సర్కిల్‌లో ఎవరు ఫోన్ చేసి హెల్ప్ అడిగినా వెంటనే స్పందిస్తున్నాని.. కానీ కొందరిలా కేవలం ఫొటో గ్యాలరీల కోసం పనిచేయట్లేదని చెప్పుకొచ్చింది. హెల్ప్ కోసం ఫ్రెండ్స్, బంధువల నుంచి తనకు వస్తున్న కాల్స్ అన్నింటినీ సోదరుడు అక్షిత్‌కు ఫార్వార్డ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో నిజంగా సాయం కోసం అర్థిస్తున్న వారెవరో గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న సంఘటనలు తన దృష్టికి వచ్చినట్టు తెలిపింది.

 

Tags:    

Similar News