డబ్బులు లేక.. నా డ్రెస్ నేనే డిజైన్ చేసుకున్న: కంగన

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఫ్యాషన్’ సినిమాలో నటనకుగాను 11 ఏళ్ల క్రితం తొలిసారి బెస్ట్ సపోర్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ అభిమాని పోస్ట్ పెట్టగా దీనిపై స్పందించిన కంగన.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ఈ అవార్డు తనకు చాలా చాలా స్పెషల్ అని తెలిపింది. ఫస్ట్ నేషనల్ అవార్డుతో చాలా మెమొరీస్ ఉన్నాయని.. అతి చిన్న వయసులో జాతీయ అవార్డు అందుకున్న నటుల్లో తను ఒకరని […]

Update: 2021-01-24 01:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఫ్యాషన్’ సినిమాలో నటనకుగాను 11 ఏళ్ల క్రితం తొలిసారి బెస్ట్ సపోర్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ అభిమాని పోస్ట్ పెట్టగా దీనిపై స్పందించిన కంగన.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ఈ అవార్డు తనకు చాలా చాలా స్పెషల్ అని తెలిపింది. ఫస్ట్ నేషనల్ అవార్డుతో చాలా మెమొరీస్ ఉన్నాయని.. అతి చిన్న వయసులో జాతీయ అవార్డు అందుకున్న నటుల్లో తను ఒకరని పేర్కొంది.

ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ కోసం ఉమన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా అనిపించిందని చెప్పింది. అంతే కాదు ఈ కార్యక్రమం కోసం స్పెషల్ డ్రెస్ కొనేందుకు సరిపోయేంత డబ్బులు లేకపోవడంతో తన దుస్తులు తానే డిజైన్ చేసుకున్నానని.. బాగుంది కదా? అంటూ పోస్ట్ పెట్టింది క్వీన్ కంగన. మధుర్ భండార్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సోనాలి గుజ్రాల్‌గా బెస్ట్ పర్‌ఫార్మన్స్ ఇచ్చింది కంగన. ప్రియాంక చోప్రా, ముగ్దా గాడ్సే ఫిమేల్ లీడ్స్‌లో కనిపించారు. ప్రస్తుతం కంగన ‘ధాకడ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న మూవీలో ఏజెంట్ అగ్నిగా కనిపించనుంది.

Tags:    

Similar News