కంగన బాల్యస్మృతిలో భోగి పాటలు

దిశ, వెబ్‌డెస్క్ : రబీ పంటలు ఇంటికి చేరిన సందర్భంగా.. ఉత్తరాదిన ‘లోహ్రీ’ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా చలిమంటలు వేస్తూ, నృత్యాలు చేస్తూ, ప్రజలంతా సంతోషంగా గడుపుతారు. ఈ రోజు భోగి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన చిన్నప్పటి ‘లోహ్రీ’ పండుగ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాటు అప్పటి ఫొటోను ఇన్‌స్టాలో తన అభిమానులతో పంచుకుంది. ‘హిమాచల్‌లో లోహ్రీ పండుగ సందర్భంగా పాటలు పాడే సంప్రదాయం ఉంది, నేను బాల్యంలో […]

Update: 2021-01-13 06:29 GMT
కంగన బాల్యస్మృతిలో భోగి పాటలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : రబీ పంటలు ఇంటికి చేరిన సందర్భంగా.. ఉత్తరాదిన ‘లోహ్రీ’ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా చలిమంటలు వేస్తూ, నృత్యాలు చేస్తూ, ప్రజలంతా సంతోషంగా గడుపుతారు. ఈ రోజు భోగి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన చిన్నప్పటి ‘లోహ్రీ’ పండుగ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాటు అప్పటి ఫొటోను ఇన్‌స్టాలో తన అభిమానులతో పంచుకుంది.

‘హిమాచల్‌లో లోహ్రీ పండుగ సందర్భంగా పాటలు పాడే సంప్రదాయం ఉంది, నేను బాల్యంలో ఉన్నప్పుడు పిల్లలందరం ఒకచోట చేరేవాళ్లం. ఆ తర్వాత అందరం కలిసి పాటలు పాడుతూ, తమ ప్రాంతంలోని ఇళ్లకు వెళ్లి డబ్బు, స్వీట్లు సేకరించేవాళ్లం. నగరాల్లో ఉండే పిల్లలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్‌తో పోల్చుకుంటే.. గ్రామాల్లోని పిల్లలు, ఉమ్మడి కుటుంబాలు చాలా సంతోషంగా గడుపుతారు. వారి ఆనందాలు, పండగ సంబురాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఏదీ ఏమైనప్పటికీ హ్యాపీ లోహ్రీ’ అని తన బాల్యస్మృతులను గుర్తుచేసుకున్న కంగన.. చివర్లో తనదైన శైలిలో ఓ పంచ్ కూడా వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బాంబ్లా అనే చిన్న గ్రామంలోనే కంగన పుట్టిపెరిగింది. అక్కడ సంక్రాంతిని ‘మాఘ సాజి’గా జరుపుకుంటారు.

Tags:    

Similar News