సంచలన వార్తలకు మారు పేరు దిశ

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్తలకు దిశ దిన పత్రిక మారుపేరుగా మారిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.

Update: 2025-01-14 15:29 GMT
సంచలన వార్తలకు మారు పేరు దిశ
  • whatsapp icon

దిశ,వనపర్తి : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్తలకు దిశ దిన పత్రిక మారుపేరుగా మారిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం(ప్రజా భవన్)లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా దిశ దిన పత్రిక బ్యూరో నర్సింహులు, వనపర్తి జిల్లా ప్రతినిధి అంబటి స్వామి లతో కలిసి ఆవిష్కరించారు.

    ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను ప్రజల చెంతకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకొస్తున్నారన్నారు. దిశ దినపత్రిక దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ దిన పత్రిక విలేకర్లు వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపురం రేవల్లి, గోపాల్ పేట కృష్ణయ్య యాదవ్, కరుణాకర్, రమేష్, రామ కృష్ణ, కృష్ణ, శ్రీనాథ్, కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సతీష్, బ్రహ్మచారి, ఎస్.ఎల్.ఎన్ రమేష్ తదితరులు ఉన్నారు.


Similar News