రెండో టెస్టుకు కేన్ విలియమ్‌సన్ దూరం

దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే నడవనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ భారత్‌కు తిరిగి వచ్చేయనున్నాడు. అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వ బోతుండటంతో కోహ్లీ సెలవు తీసుకున్నాడు. కేన్ విలియమ్‌సన్ భార్య సారా రహీమ్ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. ఆమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నారు. తమ జంటకు తొలి సంతానం కలగనుండటంతో కేన్ విలియమ్‌సన్ కూడా సెలవు […]

Update: 2020-12-10 09:48 GMT

దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే నడవనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ భారత్‌కు తిరిగి వచ్చేయనున్నాడు. అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వ బోతుండటంతో కోహ్లీ సెలవు తీసుకున్నాడు. కేన్ విలియమ్‌సన్ భార్య సారా రహీమ్ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. ఆమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నారు. తమ జంటకు తొలి సంతానం కలగనుండటంతో కేన్ విలియమ్‌సన్ కూడా సెలవు తీసుకోబోతున్నాడు. వెస్టిండీస్‌తో జరుగనున్న రెండో టెస్టుకు ఆయన దూరం కానున్నారు. ఈ విషయాన్ని జట్టు కోచ్ గారీ స్టిడ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేన్ విలియమ్‌సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్‌కు కెప్టెన్సీ అప్పగించారు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసి న్యూజీలాండ్‌కు విజయం అందించిన విలియమ్‌సన్ లేకపోవడం బ్లాక్ క్యాప్స్‌కు పెద్ద లోటే.

Tags:    

Similar News