కివీస్ వెళ్లని కేన్ విలియమ్‌సన్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లు అందరూ తమ స్వదేశాలకు పయనం అయ్యారు. అయితే న్యూజీలాండ్‌కు చెందిన కేన్ విలియమ్‌సన్, మరో ముగ్గురు ఇండియాలోనే ఉండనున్నట్లు న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. మే 11 వరకు కేన్ విలియమ్‌సన్, కేల్ జేమిసన్, మిచెల్ సాంట్నర్‌తో పాటు ఫిజియో టామ్ సిమ్‌సెక్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మినీ బయోబబుల్‌లో ఉంటారని న్యూజీలాండ్ బోర్డు చెప్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో సభ్యులైన వీరందరూ […]

Update: 2021-05-06 08:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లు అందరూ తమ స్వదేశాలకు పయనం అయ్యారు. అయితే న్యూజీలాండ్‌కు చెందిన కేన్ విలియమ్‌సన్, మరో ముగ్గురు ఇండియాలోనే ఉండనున్నట్లు న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. మే 11 వరకు కేన్ విలియమ్‌సన్, కేల్ జేమిసన్, మిచెల్ సాంట్నర్‌తో పాటు ఫిజియో టామ్ సిమ్‌సెక్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మినీ బయోబబుల్‌లో ఉంటారని న్యూజీలాండ్ బోర్డు చెప్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో సభ్యులైన వీరందరూ మే 11 తర్వాత నేరుగా ఇంగ్లాండ్ వెళ్తారని బోర్డు స్పష్టం చేసింది.

కాగా, జూన్ 2 నుంచి న్యూజీలాండ్‌లో ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టులు ఆడనున్నది. ఆ మ్యాచ్‌లో వీరు ఆడటం లేదని బోర్డు తెలిపింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే మిగతా న్యూజీలాండ్ టీమ్ అంతా జూన్ 16న ఇంగ్లాండ్ వెళ్తుందని చెప్పింది. కాగా, నలుగురు కివీస్ ఆటగాళ్లకు ముందుగానే బస ఏర్పాటు చేస్తున్నందుకు గాను ఈసీబీకి న్యూజీలాండ్ బోర్డు ధన్యవాదాలు తెలిపింది.

 

Tags:    

Similar News