కామారెడ్డిలో మిల్లర్ల గోల్ మాల్.. రోడ్డెక్కిన రైతన్నలు..

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం సరంపల్లి లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో నిబంధనల ప్రకారం రైతులు ధాన్యం విక్రయించారు. అయితే కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించగా మిల్లర్లు ధాన్యం లో తేమ శాతం ఎక్కువగా ఉందని లారీ ని వెనక్కి పంపించారు. తాము, కేంద్రం నిర్వాహకులు చూసినప్పుడు తేమశాతం నిబంధనలకు లోబడే ఉందని, కానీ వర్షం, వాతావరణం కారణంగా తేమ శాతం పెరిగి ఉండొచ్చని రైతులు పేర్కొన్నారు. […]

Update: 2021-11-18 06:52 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం సరంపల్లి లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో నిబంధనల ప్రకారం రైతులు ధాన్యం విక్రయించారు. అయితే కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించగా మిల్లర్లు ధాన్యం లో తేమ శాతం ఎక్కువగా ఉందని లారీ ని వెనక్కి పంపించారు. తాము, కేంద్రం నిర్వాహకులు చూసినప్పుడు తేమశాతం నిబంధనలకు లోబడే ఉందని, కానీ వర్షం, వాతావరణం కారణంగా తేమ శాతం పెరిగి ఉండొచ్చని రైతులు పేర్కొన్నారు.

మమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే మిల్లర్లు ఇలాంటి కుంటిసాకులు చూపుతున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యం లో తేమ శాతం పెరిగితే తప్పు మాదా ? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మిల్లర్ లపై చర్యలు తీసుకొని రైతుల వద్ద ఉన్న అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News