కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం.. గేట్ ‘లాక్’ విరగడంతో దూసుకెళ్లిన కార్యకర్తలు

దిశ, కామారెడ్డి : నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన 31 నెలల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఫ్రొబెల్స్ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. […]

Update: 2021-06-29 03:09 GMT

దిశ, కామారెడ్డి : నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన 31 నెలల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.

ఫ్రొబెల్స్ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ గేట్ మూసేసి బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా వినకుండా బీజేవైఎం నాయకులు.. గేటు దూకి, గేటును తోసుకుని కలెక్టర్ కార్యాలయ సమావేశం హాలు గేటు వద్దకు పరుగెత్తారు. అక్కడ పోలీసులు వారిని నిలువరించగా గేటు ముందే బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేయకుండా కలెక్టర్‌కు మెమోరాండం ఇవ్వాలని పోలీసులు సూచించగా.. సీఎం కాళ్ళు మొక్కిన కలెక్టర్‌కు మెమోరాండం ఇవ్వడానికి తాము ఇక్కడికి రాలేదని, మెమోరాండం ఇవ్వడానికి నిరాకరించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ తెచ్చుకుంటే నీళ్లు కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు, నిధులు కేసీఆర్ ఇంటికి, నియామకాలు ఆయన కుటుంబానికే దక్కాయన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం 31 నెలల నిరుద్యోగ భృతి అర్హత ఉన్న వారికి వెంటనే ఇవ్వాలన్నారు.

తాము పీజీలు, పీహెచ్‌డీలు చేసింది ఉపాధి హామీ పనులకు వెళ్లాడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సివిల్స్ రాసి ఉన్నత స్థానంలో ఉండి, దొర కాళ్ళు మొక్కిన కలెక్టర్‌కు తాము మెమోరాండం ఇవ్వడం లేదని చెప్పారు. వెంటనే తెలంగాణ ప్రజలకు కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి స్టేషన్‌కు తరలించారు.

విరిగిన గేటు లాక్..

బీజేవైఎం కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా గేట్ వద్ద బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గేటు మూసివేసిన పోలీసులకు బీజేవైఎం నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు గేట్ దూకి లోపలికి వెళ్లగా మరికొందరు గేటును తోసుకుని కార్యాలయంలోకి వెళ్లారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ గేట్ కింది భాగంలో ఏర్పాటు చేసిన లాక్.. తోపులాటలో విరిగిపోయింది. లాక్ చేయడానికి రోడ్డుపై రంధ్రాలు చేయకపోవడంతో ముట్టడి సందర్బంగా నాయకులను పోలీసులు నిలువరించలేకపోయారు.

గేటు లాక్ విరిగిపోవడంతో గేట్ ఓపెన్ అయి బీజేవైఎం నాయకులు లోపలికి వెళ్లగలిగారు. నాయకుల అరెస్ట్ అనంతరం గేటు వద్ద చూడగా గేటు లాక్ కింద పడిన విషయాన్ని పోలీసులు గమనించారు. కలెక్టరేట్ అధికారులకు విషయం తెలియజేయగా కార్యాలయ ఏవో వచ్చి తమ సిబ్బందితో మరమ్మత్తులు చేయించారు. అనంతరం గేటుకు కావాల్సిన ప్రొటెక్షన్‌ను పకడ్బంధీగా ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags:    

Similar News