మాస్క్ ధరించకుంటే రూ. 500 జరిమానా విధించాలి : కలెక్టర్ శరత్

దిశ, నిజామాబాద్: మాస్కు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత హాలులో ఐకేపీ ఏపీఎంలు, ఎంపీవోలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా మాస్కులను తయారు చేయించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున ఇవ్వాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10, ఎల్లారెడ్డి, […]

Update: 2020-04-24 07:58 GMT

దిశ, నిజామాబాద్: మాస్కు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత హాలులో ఐకేపీ ఏపీఎంలు, ఎంపీవోలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా మాస్కులను తయారు చేయించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున ఇవ్వాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10, ఎల్లారెడ్డి, బాన్సువాడలో 5 చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేసి మాస్కులు విక్రయించాలని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో రెండు చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఐకేపీ అధికారులు తయారు చేయించిన మాస్క్‌లను పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో విక్రయించాలన్నారు. మాస్కులు ధరించడం ద్వారా 99 శాతం కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని తెలిపారు. ఐకేపీ అధికారులు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, కరోనా వైరస్ రుణాలు ఇప్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్‌డీఏ చంద్రమోహన్ రెడ్డి, డీపీఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: Kamareddy collector, Dr.sharath, Review, Mask, counters

Tags:    

Similar News