కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
దిశ, నిజామాబాద్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలెక్టర్ శరత్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. మొదట రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటలు నాసిరకంగా ఉండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీని మార్చాలని ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డిని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని […]
దిశ, నిజామాబాద్
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలెక్టర్ శరత్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. మొదట రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటలు నాసిరకంగా ఉండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీని మార్చాలని ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డిని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది పనితీరు గురించి వాకబు చేశారు. కాన్పు అనంతరం ఇచ్చే కేసీఆర్ కిట్లను పరిశీలించారు. అనంతరం గర్గుల్ గ్రామంలో హరితాహారం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమములో ఎంపీవో సవిత, తహసీల్దార్ బాబా షరీఫుద్దీన్, ఎంపీడీవో శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: kamareddy district, collector sharath kumar, inspection school, hospital