ఈటలకు షాకిచ్చిన కమలాపూర్ లీడర్స్

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆయన సొంతమండలానికి చెందిన నాయకులు షాక్ ఇచ్చారు. కమలాపూర్లో తిరుగులేని ఆయనకు పట్టు ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయన వెన్నంటే ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా శనివారం హైదరాబాద్‌లో మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బోయినలపల్లి వినోద్ కుమార్‌లతో కమలాపూర్ నాయకులు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తాము […]

Update: 2021-05-22 04:42 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆయన సొంతమండలానికి చెందిన నాయకులు షాక్ ఇచ్చారు. కమలాపూర్లో తిరుగులేని ఆయనకు పట్టు ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయన వెన్నంటే ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా శనివారం హైదరాబాద్‌లో మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బోయినలపల్లి వినోద్ కుమార్‌లతో కమలాపూర్ నాయకులు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తాము రానున్న కాలంలో కూడా టీఆర్ఎస్ తోనే ఉంటామన్నారు. కమలాపూర్ ఎంపీపీ తడక రాణీ, ఫ్యాక్స్ చైర్మన్ పేరాల సంపత్ రావు, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ పి.కృష్ణ ప్రసాద్, మండలరైతుబంధు అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకుడు కుమారస్వామితో పాటు పలువురు నాయకులు హరీష్ రావు, వినోద్ కుమార్‌లతో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

Tags:    

Similar News