పోలీసులు వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కిన కమల్

దిశ, వెబ్‌డెస్క్: ‘భారతీయుడు 2’ సినిమా కమల్ హాసన్‌కు తలనొప్పిగా మారింది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. చెన్నైలోని ఈవీసీ స్టూడియోస్‌లో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ కింద పడిన ఘటనలో ముగ్గురు సినీ కార్మికులు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం యావత్ సినీ ఇండస్ట్రీనే దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనలో అనుమతికి మించిన ఎత్తులో క్రేన్ సెట్ చేశారని .. […]

Update: 2020-03-17 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘భారతీయుడు 2’ సినిమా కమల్ హాసన్‌కు తలనొప్పిగా మారింది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. చెన్నైలోని ఈవీసీ స్టూడియోస్‌లో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ కింద పడిన ఘటనలో ముగ్గురు సినీ కార్మికులు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం యావత్ సినీ ఇండస్ట్రీనే దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనలో అనుమతికి మించిన ఎత్తులో క్రేన్ సెట్ చేశారని .. అందుకే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇస్తోంది మూవీ యూనిట్. కానీ ఈ విషయంలో తనతో పాటు డైరెక్టర్ శంకర్‌ను విచారిస్తూనే ఉంది సీబీసీఐడి. పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి విచారించారు అధికారులు. దీంతో విసుగు చెందిన కమల్… పోలీసులు తనను వేధిస్తున్నారని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా అత్యవసర విచారణకు పిటిషన్‌ను స్వీకరించింది కోర్టు.

tags : Kamal Haasan, Indian 2, Madras High Court

Tags:    

Similar News