నామినేషన్స్ : అత్యంత ధనవంతుడు కమల్‌నే

దిశ, వెబ్‌డెస్క్: లోకనాయకుడు, మ‌క్కల్ నీధి మ‌య్యిం(ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. తొలిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో కమల్ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు?.. కమల్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే చర్చ తమిళనాట జోరుగా జరుగుతోంది. అయితే ఇవాళ కమల్‌హాసన్ ఎన్నికల నామినేషన్ వేశారు. తమ పార్టీ అభ్యర్ధిగా కోయంబత్తూరు సౌత్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా […]

Update: 2021-03-16 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోకనాయకుడు, మ‌క్కల్ నీధి మ‌య్యిం(ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. తొలిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో కమల్ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు?.. కమల్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే చర్చ తమిళనాట జోరుగా జరుగుతోంది.

అయితే ఇవాళ కమల్‌హాసన్ ఎన్నికల నామినేషన్ వేశారు. తమ పార్టీ అభ్యర్ధిగా కోయంబత్తూరు సౌత్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో కమల్ పొందుపర్చిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తన ఆస్తుల వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఎన్నికల అఫిడవిట్‌లో కమల్ పొందుపర్చారు.

తన ఆస్తుల విలువను రూ. 176.9 కోట్లుగా పేర్కొన్న కమల్.. రూ.131.9 కోట్ల స్థిరాస్తులు, రూ.2.7 కోట్ల చరాస్తులు ఉన్నాయన్నారు. ఇక తనకు భార్య లేదని, తనపై ఆధారపడినవారు కూడా ఎవరూ లేరని కమల్ తెలిపారు. తాను 8వ తరగతి చదువుకున్నట్లు అఫిడవిట్‌లో కమల్ పొందుపర్చారు. కాగా ఇప్పటివరకు తమిళనాడు ఎన్నికల్లో నామినేషన్ వేసిన వారిలో అత్యంత ధనవంతుడు కమల్ కావడం గమనార్హం.

Tags:    

Similar News