నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత.. అనుకున్న ముహూర్తానికే నామినేషన్..

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు చివరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి సమర్పించారు. ఉదయం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత తరఫున నామినేషన్ మొదటి సెట్ దాఖలు చేశారు. రెండో సెట్ ను బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమర్పించారు. మధ్యాహ్నం సరిగ్గా ముహూర్తం […]

Update: 2021-11-23 04:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు చివరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి సమర్పించారు. ఉదయం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత తరఫున నామినేషన్ మొదటి సెట్ దాఖలు చేశారు. రెండో సెట్ ను బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమర్పించారు. మధ్యాహ్నం సరిగ్గా ముహూర్తం 1.45 గంటలకు కవిత స్వయంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

అంతకుముందు ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, స్థానిక ఎమ్మెల్యే లతో కలిసి సమావేశం నిర్వహించారు. ముహూర్త సమయానికి ముందుగా నిజామాబాద్ కలెక్టరేట్ కు తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమెల్సీ గా నామినేషన్ దాఖలు చేశానన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు 90 శాతం మంది టీఅర్ఎస్ కు చెందిన వారని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News