కాజోల్‌ను గుర్తుచేసిన కూతురి డ్యాన్స్.. నెట్టింట వైరల్
దిశ, సినిమా : బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ కూతురు నీసా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింగపూర్‌లో చదువుతున్న నీసా.. స్కూల్ ఈవెంట్‌లో చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌ను స్టోల్ చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి గ్రూప్ డ్యాన్స్‌లో కనిపించిన స్టార్ కిడ్.. మదర్ కాజోల్ సాంగ్స్‌కు గ్రేస్ ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. బోలె చూడియా – కభి ఖుషి కభి గమ్, తేరే నయనా – మై నేమ్ ఈజ్ ఖాన్, […]
దిశ, సినిమా : బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ కూతురు నీసా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింగపూర్‌లో చదువుతున్న నీసా.. స్కూల్ ఈవెంట్‌లో చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌ను స్టోల్ చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి గ్రూప్ డ్యాన్స్‌లో కనిపించిన స్టార్ కిడ్.. మదర్ కాజోల్ సాంగ్స్‌కు గ్రేస్ ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. బోలె చూడియా – కభి ఖుషి కభి గమ్, తేరే నయనా – మై నేమ్ ఈజ్ ఖాన్, సజ్దా పాటలకు డ్యాన్స్ చేసి ఫిదా చేసింది. వైట్ టాప్, గ్రీన్ కలర్ స్కర్ట్‌లో కనిపించిన నీసా స్టెప్స్ కాజోల్‌ను గుర్తుచేశాయని కొందరు అంటుంటే.. సో టాలెంటెడ్ అని మరి కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే నీసా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనేది ఇంకా క్వశ్చన్ మార్క్‌గానే ఉంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నీసాను లాంచ్ చేస్తారా లేదా? అన్న ప్రశ్నకు కాజోల్ ‘లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పిన విషయం తెలిసిందే.