‘తల్లి’ కాబోతున్న కాజల్ అగర్వాల్.. షాక్‌లో ఫాన్స్..
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ క్లిచుతో డేటింగ్ చేసి గత సంవత్సరం అక్టోబర్ 30న కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ పెళ్లి చేసుకోవడంతో అభిమానుల్లో షాకైన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయాన్ని ఫాన్స్ ఇచ్చింది ఈ భామ. అదేటంటే ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ తల్లి కాబోతున్నారు. కానీ.. రియల్ లైఫ్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ క్లిచుతో డేటింగ్ చేసి గత సంవత్సరం అక్టోబర్ 30న కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ పెళ్లి చేసుకోవడంతో అభిమానుల్లో షాకైన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయాన్ని ఫాన్స్ ఇచ్చింది ఈ భామ. అదేటంటే ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ తల్లి కాబోతున్నారు.
కానీ.. రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. పెళ్లికి ముందు గ్లామరస్ రోల్లో కనిపించిన కాజల్, ‘కరుంగాపియం’ అనే చిత్రంలో తల్లి పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాను డీకే అనే దర్శకుడు రూపొందిస్తుండగా, ఈ చిత్రంలో కాజల్ పాత్ర పిరియాడిక్ నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో కాజల్ పాత్ర చాలా పవర్‌పుల్‌గా కనిపించబోతుందని, ఇదివరకు కనిపించని విధంగా ఈ సినిమాలో కాజల్ కనిపిస్తారంట. ఈ సినిమాలో కాజల్‌తో పాటు రెజీనా కసాండ్రా, జననితో పాటు మరో కొత్త అమ్మాయి నటించబోతున్నట్లు సమాచారం.