సుప్రీంకోర్టులో కుప్పకూలిన జస్టిస్ భానుమతి
‘నిర్భయ’ దోషులను వేరువేరుగా ఉరితీసేందుకు అనుమతివ్వాలని కేంద్రం అభ్యర్థిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయమూర్తి ఆర్ భానుమతి ఉన్నఫళంగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ స్పృహలోకి వచ్చారు. ఈ పిటిషన్ విచారిస్తున్న మిగితా ఇద్దరు న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, అశోక్ భూషణ్‌లు సహా కోర్టు సిబ్బంది ఆమెను చాంబర్‌లోకి తీసుకెళ్లారు. వైద్య సహాయం కోసం వీల్ చెయిర్‌లో తీసుకెళ్లారు. జస్టిస్ భానుమతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకుంటున్నారని సొలిసిటర్ జనరల్ […]
‘నిర్భయ’ దోషులను వేరువేరుగా ఉరితీసేందుకు అనుమతివ్వాలని కేంద్రం అభ్యర్థిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయమూర్తి ఆర్ భానుమతి ఉన్నఫళంగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ స్పృహలోకి వచ్చారు. ఈ పిటిషన్ విచారిస్తున్న మిగితా ఇద్దరు న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, అశోక్ భూషణ్‌లు సహా కోర్టు సిబ్బంది ఆమెను చాంబర్‌లోకి తీసుకెళ్లారు. వైద్య సహాయం కోసం వీల్ చెయిర్‌లో తీసుకెళ్లారు. జస్టిస్ భానుమతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకుంటున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా అన్నారు. కాగా, కేంద్రం వేసిన పిటిషన్‌పై ఆదేశాలు ఆ చాంబర్ నుంచే వెలువరించనున్నట్టు న్యాయమూర్తులు వెల్లడించారు.