అత్తకు అవమానం.. స్పందించిన జూనియర్ NTR (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని శుక్రవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అనేకమంది రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. చట్టసభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు హితవు పలకగా, తాజాగా.. తన అత్తకు జరిగిన అవమానంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడటం అరాచక పాలనకు నాంది పలుకుతుందని అన్నారు. ఆడవాళ్లను గౌరవించడం భారతదేశ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని శుక్రవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అనేకమంది రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. చట్టసభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు హితవు పలకగా, తాజాగా.. తన అత్తకు జరిగిన అవమానంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడటం అరాచక పాలనకు నాంది పలుకుతుందని అన్నారు. ఆడవాళ్లను గౌరవించడం భారతదేశ సంస్కృతి అని వెల్లడించారు. చట్ట సభలో ప్రజల సమస్యల గురించి చర్చించాల్సింది పోయి, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం మంచి పరిణామం కాదని తెలిపారు. అంతేగాకుండా.. తాను కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని, దేశ పౌరుడిగా స్పందించానని అన్నారు.
— Jr NTR (@tarak9999) November 20, 2021