ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఆళ్లనాని, ఆరోగ్య ముఖ్య కార్యదర్శితో చర్చలు సఫలం అయ్యాయి. కాగా, ఈ నెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్టు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు ఏపీ ప్రభుత్వానికి ఇటీవల సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆరోగ్య బీమా, పరిహారం కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నోటీసుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

Update: 2021-06-09 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఆళ్లనాని, ఆరోగ్య ముఖ్య కార్యదర్శితో చర్చలు సఫలం అయ్యాయి. కాగా, ఈ నెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్టు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు ఏపీ ప్రభుత్వానికి ఇటీవల సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆరోగ్య బీమా, పరిహారం కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నోటీసుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలన్నారు. స్టైఫండ్‌లో టీడీఎస్ కట్ చేయకూడదని తేల్చి చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించాలని.. లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారానికి ఒకే చెప్పింది.

Tags:    

Similar News