పెంచిన పీజీ మెడికల్ సీట్ల ఫీజులు తగ్గించాలి : జూడాలు

ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుకూలంగా పీజీ మెడికల్ సీట్ల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూగురువారం కోఠి మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. 2017సంవత్సరంలో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, దానికి సంబంధించి పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారంటూ జూడాలు ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక ఫీజులు పెంచుతూ విడుదల చేసిన జీవో నెం28ను వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. […]

Update: 2020-05-07 09:59 GMT

ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుకూలంగా పీజీ మెడికల్ సీట్ల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూగురువారం కోఠి మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. 2017సంవత్సరంలో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, దానికి సంబంధించి పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారంటూ జూడాలు ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక ఫీజులు పెంచుతూ విడుదల చేసిన జీవో నెం28ను వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మేము కరోనాతో పోరాడాలా లేక ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారితో పోరాడాలా అని జూడాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags: junior doctors, protest, hike medicine fee, dismiss go no 28, demand

Tags:    

Similar News