ప్రభుత్వానికి జూడాల హెచ్చరిక.. తేలుస్తారా.. తేల్చుకోమంటారా..?

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా మొదటి దశ, రెండో దశలోనూ రోగులకు చికిత్స అందించడంలో జూనియర్ డాక్టర్లు కీలక పాత్ర పోషించారు. తమ ప్రాణాలకు తెగించి కొవిడ్ రోగులకు అండగా నిలుస్తూ వారికి వైద్యం అందించారు. అయితే, మరోసారి జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తమకు గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 26 నుంచి విధుల బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం.ఇప్పటికే జూడాలు […]

Update: 2021-05-23 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా మొదటి దశ, రెండో దశలోనూ రోగులకు చికిత్స అందించడంలో జూనియర్ డాక్టర్లు కీలక పాత్ర పోషించారు. తమ ప్రాణాలకు తెగించి కొవిడ్ రోగులకు అండగా నిలుస్తూ వారికి వైద్యం అందించారు. అయితే, మరోసారి జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తమకు గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈనెల 26 నుంచి విధుల బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం.ఇప్పటికే జూడాలు ప్రతీరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హామీ ప్రకారం 15శాతం స్టైఫండ్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 10 శాతం వెంటనే ఇన్సెంటివ్ ప్రకటించాలి కోరుతున్నారు. కరోనా సోకిన హెల్త్ కేర్ వర్కర్స్‌కు నిమ్స్‌లో వైద్యం అందించేలా జీవో జారీ చేయాలని, కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి స్పందన కరువైతే 26నుంచి విధులు బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు.

Tags:    

Similar News