Junior Doctors Call Off Strike : సమ్మె విరమించిన జూడాలు..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో తమ న్యాయపరమైన డిమాండ్లు నేరవేర్చారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. స్టైఫండ్స్, ఇన్సెంటివ్, కరోనా మరణానికి ఎక్స్ గ్రేషియా వంటివి జూడాల డిమాండ్లలో ప్రధానమైనవి. ఈ హామీలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఇచ్చిందని అయితే అవి ఇంతవరకు అమలు కాలేదని జూడాలు మరోసారి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే జూడాలతో రెండు పర్యాయాలు చర్చలు జరిపిన ప్రభుత్వం ఎట్టకేలకు స్టైఫండ్ పెంచుతూ నిర్ణయం […]

Update: 2021-05-27 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో తమ న్యాయపరమైన డిమాండ్లు నేరవేర్చారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. స్టైఫండ్స్, ఇన్సెంటివ్, కరోనా మరణానికి ఎక్స్ గ్రేషియా వంటివి జూడాల డిమాండ్లలో ప్రధానమైనవి. ఈ హామీలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఇచ్చిందని అయితే అవి ఇంతవరకు అమలు కాలేదని జూడాలు మరోసారి ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలోనే జూడాలతో రెండు పర్యాయాలు చర్చలు జరిపిన ప్రభుత్వం ఎట్టకేలకు స్టైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి నెల నుంచి అమలు కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తమ డిమాండ్ల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు గురువారం సాయంత్రం ప్రకటించారు.

Tags:    

Similar News