ఫిలింనగర్‌లో విషాదం.. ప్రియుడు మోసం చేశాడని ఆర్టిస్ట్ ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్ : ఫిలింనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రియుడు మోసం చేశాడని తీవ్రమనస్తాపానికి గురైన టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కావలి అనురాధ అనే యువతి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌ బస్తీలో నివాసం ఉంటుంది. సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. కొన్నాళ్ళు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె అతడు పెళ్లి చేసుకుంటానని […]

Update: 2021-09-29 22:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఫిలింనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రియుడు మోసం చేశాడని తీవ్రమనస్తాపానికి గురైన టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కావలి అనురాధ అనే యువతి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌ బస్తీలో నివాసం ఉంటుంది. సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. కొన్నాళ్ళు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో కొన్ని రోజుల నుంచి ఆమె కిరణ్‌తో సహజీవనం చేసింది.

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయంపై అనురాధ కిరణ్‌తో గొడవపడింది. అనంతరం ఇంటి నుంచి వారిద్దరు ఉండే రూమ్‌కు వెళ్లింది. మూడు రోజుల నుంచి ఎలాంటి ఫొన్ లేదు.. అయితే తాను ఉండే రూమ్ నుంచి దుర్వాసన రావడంతో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కుళ్లిపోయిన శవం చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రియుడితో గొడవపడి వచ్చిన రోజే తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడు కిరణ్‌ కోసం గాలింపు చేపట్టారు.

 

 

Tags:    

Similar News