‘జూడాలు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్లే’

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లు పట్టింపులకు పోకుండా సమస్యకు పరిష్కారం చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కోఠి ఈఎన్‌టీ, నిమ్స్ ఆస్పత్రులను సందర్శించారు. ముందుగా ఈఎన్‌టీకి వచ్చిన ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ఆర్ఎంఓ డాక్డర్ మనీష్ లతో వార్డులలో రోగులతో నేరుగా మాట్లాడారు. ఎక్కడి నుండి వచ్చారు ? హాస్పిటల్ లో వసతులు ఎలా ఉన్నాయని ఆయన […]

Update: 2021-05-27 04:31 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లు పట్టింపులకు పోకుండా సమస్యకు పరిష్కారం చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కోఠి ఈఎన్‌టీ, నిమ్స్ ఆస్పత్రులను సందర్శించారు. ముందుగా ఈఎన్‌టీకి వచ్చిన ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ఆర్ఎంఓ డాక్డర్ మనీష్ లతో వార్డులలో రోగులతో నేరుగా మాట్లాడారు. ఎక్కడి నుండి వచ్చారు ? హాస్పిటల్ లో వసతులు ఎలా ఉన్నాయని ఆయన వారిని అడిగి
తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కొవిడ్, బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో వారు సమ్మె చేయడం సరైందా, కాదా అనేది పక్కన పెడితే వారు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్లని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా కేసులు తగ్గడమే కాకుండా కొత్తగా బ్లాక్ ఫంగస్ వ్యాధి కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి కాదని , అది ఎప్పటి నుండో ఉందని, ఈఎన్టీ ఆస్పత్రిలో ఆరు నెలలకు ఒక కేసు గతంలో నమోదయ్యేదని, అయితే కోవిడ్ కారణంగా ఇటీవల కాలంలో ఈ కేసులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని కిషన్ రెడ్డి అన్నారు . బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణ కోసం కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే 5690 యాంఫోటెరిసిన్‌ బి ఇంజక్షన్లు అందించినట్లు తెలిపారు . యాంపొటెరిసిన్ ఇంజక్షన్లను దేశంలోని 11 కంపెనీలలో యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుందని, త్వరలో ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు .

Tags:    

Similar News