ఏపీలో ఎక్కువగా నష్టపోతున్నది జర్నలిస్టులే : కె.శ్రీనివాస్‌రెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకంటే ఎక్కువ హింసకు గురయ్యేది, నష్టపోయేది జర్నలిస్టులేనని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కొందరు జర్నలిస్టులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకుంటే జర్నలిస్టుల బతుకులు మారతాయని తాము భావించామని, అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ నమ్మకం పోయిందన్నారు. రాష్ట్రంలో అసలు పౌరసంబంధాల శాఖ ఉందా అనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అనేక ఆంక్షలతో జర్నలిజాన్ని, జర్నలిస్టులను ప్రభుత్వం తొక్కేస్తోందని […]

Update: 2021-08-11 07:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకంటే ఎక్కువ హింసకు గురయ్యేది, నష్టపోయేది జర్నలిస్టులేనని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కొందరు జర్నలిస్టులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకుంటే జర్నలిస్టుల బతుకులు మారతాయని తాము భావించామని, అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ నమ్మకం పోయిందన్నారు. రాష్ట్రంలో అసలు పౌరసంబంధాల శాఖ ఉందా అనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అనేక ఆంక్షలతో జర్నలిజాన్ని, జర్నలిస్టులను ప్రభుత్వం తొక్కేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సమాచార శాఖ రూపొందించిన విధివిధానాలను పరిశీలిస్తే ఆందోళన కలుగుతుందన్నారు. జర్నలిస్ట్‌ అక్రిడేషన్స్ విషయంలో కూడా పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 25 మంది అధికారులతో కమిటీ వేయడం నిరంకుశత్వమన్నారు. చిన్న పత్రికలు అంటూ, జీఎస్టీ అంటూ నిబంధనల పేరుతో అక్రిడేషన్స్ నిలిపివేయడం బాధాకరమన్నారు.

మీరేమైనా ఆదాయం ఇచ్చారా జీఎస్టీ రావడానికి అని ప్రశ్నించడం శోచనీయం అన్నారు. అదేమైనా రెవెన్యూనా జీఎస్టీ కట్టడానికి అని ప్రశ్నించారు. జర్నలిస్టుల పై పగబట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్ధిక సాయం అడిగితే తమకు ఏం సంబంధం లేదని సమాచార శాఖ మంత్రి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ చేతులెత్తేశారన్నారు. కనీసం మానవత్వంతో కూడా ఆలోచించలేకపోయారని విమర్శించారు. ఈ నెల 17న జర్నలిస్ట్ సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 17 లోపు ప్రభుత్వం స్పందిస్తే సంతోషమని లేని పక్షంలో 17న నిరసన తర్వాత 48 గంటల నిరాహారదీక్షకు దిగుతామని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News