రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి.. కారణం అదేనా.?

దిశ, డైనమిక్ బ్యూరో : బేగంపేట ఉమెన్స్ కాలేజీ వద్ద బైక్‌పై వెళ్తున్న జర్నలిస్టు ప్రమాదవశాత్తు పడిపోవటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేస్తున్నందున రోడ్డుపై తారును తొలగించడం వల్ల బైక్ స్కిడ్ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, రైడర్ హెల్మెట్ ధరించినప్పటికీ ఇలా జరగిందని ఆవేదన వ్యక్తం […]

Update: 2021-12-24 03:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బేగంపేట ఉమెన్స్ కాలేజీ వద్ద బైక్‌పై వెళ్తున్న జర్నలిస్టు ప్రమాదవశాత్తు పడిపోవటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేస్తున్నందున రోడ్డుపై తారును తొలగించడం వల్ల బైక్ స్కిడ్ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా, రైడర్ హెల్మెట్ ధరించినప్పటికీ ఇలా జరగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ చేసిన తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా డ్రైవింగ్‌పై నిందించారంటూ గుర్తుచేసుకుంటున్నారు. అయితే, గుర్తు తెలియని ఓ ట్రక్ ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అన్నారు.

Tags:    

Similar News